హైదరాబాద్:బిజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆయన రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్ సందేశ్ యాత్ర లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ భూములను లాక్కునే బిల్లు తీసుకువస్తున్నారని దిగ్విజయ్ సింగ్ మండి పడ్డారు. తెలంగాణ లో రైతు ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని పేర్కొన్నారు.




