– బి ఆర్ ఎస్ కు మద్దతు గా భారీ విరాళం.

– సిద్దిపేట మాల సంఘం ఆధ్వర్యంలో 51 వేలు విరాళం..
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనం సాక్షి)సిద్దిపేట పట్టణ అంబెడ్కర్ మాల కుల సంఘం కౌన్సిలర్ సాకి బాల్ లక్ష్మి ఆనంద్ ఆధ్వర్యంలో , కౌన్సిలర్ గ్యాదరి రవిందర్ , సంఘం అధ్యక్షులు భూమయ్య , గ్యాదరి మహంకాళి లు 51 వేల నూట పదహార్లు విరాళంగా అందజేశారు.సీఎం కేసీఆర్ , మంత్రి హరీష్ రావు గార్లు జాతీయ పార్టీగా టి ఆర్ ఎస్ పార్టీ ని మార్పు చేయడం సిద్దిపేట వాసులుగా గర్వంగా ఉందన్నారు.తెలంగాణ ఉద్యమ కంచుకోటగా..స్వరాష్ట్రం సాదించి నేడు జాతీయ పార్టీ గా అవతరించడం ఇక్కడి ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టం అని అన్నారు.. ఈ సందర్భంగా నగదు ను మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్,పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి కి అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు గ్యాదరి,రామస్వామి,బత్తుల శ్రీనివాస్,గ్యాదరి.కానుకమల్లయ్య,గ్యాదరి,గ్యాదరి. మల్లేశం, సాకి. శ్రీనివాస్,దాసరి. శ్రీనివాస్, గ్యాదరి భూమలింగం,దువ్వల. లింగం,గ్యాదరి.బాలమల్లు,బుర్క.బాలనర్సయ్య,గ్యాదరి.భూమలిగం,గుజ్జరి. శ్రీనివాస్,జక్కుల. రాజు, గుజ్జరి. రాందాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Attachments area