Thursday, 5 November 2026

బి జె పి మతాల మధ్య చిచ్చు పెట్టి మతరాజకీ యాలు చేస్తుంది-మాజి మంత్రి సంబాని

 

 

 

 

 

పెనుబల్లి, మే 14(జనం సాక్షి)దేశంలో బి జె పి మతాలమద్య చిచ్చు పెట్టి మతరాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి సంబా ని చంద్రశేఖర్ అన్నారు,హాథ్ సే హాథ్ జోడో యాత్రలో బాగంగా ఆదివారం సంభాని పెనుబల్లి మండలం పరిధిలోని బయ్యన్నగూడెం, లంకాసాగర్ గ్రామాల్లో యాత్ర నిర్వహించారు, ప్రజల నుండి యాత్రకు విశేష స్పందన లభించింది, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని,రాహుల్ గాంధీసందేశాన్ని , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్‌ని ప్రజలకు అందచేసారు,ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూబి జె పిప్రభుత్వంలో
దేశ సమగ్రతకు, దేశ రక్షణకు భంగం వాటిల్లిందని అన్నారు,రైతు వ్యతిరేకచట్టా లు, అక్రమ అరెస్టులు,రైతు ఆత్మహత్యలకు కారణమవు తున్నాయని అన్నారు,కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు బిల్లు తెస్తే, నేటి వరకూ కూడా బిల్లుపాస్ చేయకపోవడం బి జె పి పార్టీకి మహిళలపై ఉన్న చిన్నచూపుకి నిదర్శన మని అన్నారు, మోడీ పాలనలో మహిళలపై ఆకృత్యాలు విపరీతంగా పెరిగాయ ని అన్నారు,ప్రభుత్వ రంగాలని ప్రయివేటుపరం చేసి దేశ ఆర్థికవ్యవస్థని చిన్నాభిన్నం చేసిన ఘనత మోడీకే దక్కిందన్నారు,నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్ ,డీజిల్ ధరలు అధికంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆన్నారు,రాహుల్ గాంధీ దేశ సమగ్రత, సమైక్యత కొరకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర ఫలితమే కర్ణాటక విజయమని అన్నారు,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రజలకు సుభిక్షమైన పాలన అందిస్తామని అన్నారు,వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్ సి. డి పి టి కన్వీనర్ కొండూరు కిరణ్, మండల ఉపాధ్యక్షులు వడ్లమూడి కృష్ణయ్య, మాజీ గ్రామసర్పంచ్ కొండపల్లి శ్రీనివాసరావు, ఈడా కమలాకర్, కర్రి సత్యనారాయణ, పామర్తి నైస్ బాబు, మరీదు వెంకటరావు, గణేష్,గుగులోతు రాంసింగ్, మాధవ్, గరిడేపల్లి శ్రీను, గడిపర్తి శ్రీను, గద్దె శ్రీను, కాకా వెంకటేశ్వర్లు, బల్లి కాసులు, బెల్లంకొండ సీతారాములు, భోగి నరసింహారావు, అమర్నాథ్, సురేష్ నాయక్ లు
పాల్గొన్నారు.