బచ్చన్నపేట (జనం సాక్షి) దళిత పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న BRS పార్టీ పై బురద చల్లడం సరైనది కాదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంధ మల్ల నరేందర్ , గోపాల్ నగర్ సర్పంచ్ మధుప్రసాద్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామకృష్ణయ్య మృతికి కారకులైన వారు కస్టడీలో ఉన్నారని, తమ పార్టీ నుండి నేరచరితుడైన గిరబోయిన అంజయ్యను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.ఈ హత్య కేవలం గిరబోయిన అంజయ్య వ్యక్తిగత భూ వివాదాలకు సంబంధించిందె తప్ప, BRS పార్టీకి, BRS ప్రజా ప్రతినిధులకు ఎలాంటి సంబంధం లేదన్నారు.అయినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ అంటే గిట్టని కొందరు వ్యక్తులు శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు రిటైర్డ్ ఎంపీడీఓ హత్య కు భాద్యులైన వారిని కఠినంగా శిక్షించి , వారిపై చట్టరీత్యా తీసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంతకుముందే ప్రసార మాధ్యామాల ద్వారా కోరడం జరిగిందన్నారు. రామకృష్ణయ్య మృతి పై కొందరు వ్యక్తులు, వారి కుటుంబాన్ని తప్పుద్రోవ పట్టిస్తు,బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బద్నామ్ చేస్తున్నారన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, తప్పు చేస్తే ఎంతటి వ్యక్తులైన చట్టం నుండి తప్పించుకోలేరన్నారు. రామకృష్ణయ్య కుటుంబాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులపై చర్య తీసుకోవాలని త్వరలోనే సీపీ ని కలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బంధారపు వినయ్ కుమార్, జంధ్యాల ఉపేందర్, బందారం కృష్ణ , తప్పట్ల వినోద్ , అల్వాల మహిపాల్, తదితరులు పాల్గొన్నారు …
బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడం మానుకోవాలి – శవరాజకీయలు చేయడం సరికాదు




