బీఆర్ఎస్ పార్టీ లో చేరిన కన్నాల ఉప సర్పంచ్

బీఆర్ఎస్ పార్టీ లో చేరిన కన్నాల ఉప సర్పంచ్

జనం సాక్షి మంథని : మంథని నియోజక వర్గం పరిధిలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామ ఉప సర్పంచ్ పుట్ట రంజిత్ మంగళవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రాజ గృహలో బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధుకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫీట్ల గోపాల్, బయ్యపు మనోహర్ రెడ్డి ఇనుగంటి రామారావు, పుప్పాల దాయానందం పాల్గొన్నారు.