బీఎంపిలో చేరిన బహుజన నాయకులు

తొర్రూరు 16 అక్టోబర్( జనంసాక్షి )
బహుజన నాయకులు బందు వెంకన్న బహుజన ముక్తి పార్టీలో ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో కానీ మనువాదులు బహుజన వాదుల మధ్యనే రాబోయే రోజులు పోరాటాలు ఉంటాయని ఆయన అభివర్ణించారు. ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో బహుజన ముక్తి పార్టీ అతిపెద్ద బహుజన పార్టీలో బహుజన పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యాధికారం కోసం పనిచేస్తుందని ఆయన అభివర్ణించారు.బీఎంపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలకుర్తి నియోజకవర్గం డాక్టర్ నరేంద్ర పవర్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో దళిత బహుజన ప్రజలు ఏకపక్షంగా బహుజన పార్టీని బలపరిచి రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గంలో బహుజన ముక్తి పార్టీ జండా ఎగరేయడం ఖాయమని ఆయన అభివర్ణించారు.పాలకుర్తిలో అగ్రకులాలు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మధ్యనే పోటీ ఉంటుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో భారతం ముక్తి మూర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ సుగు,బహుజన ముక్తి పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ బాలునాయక్,బిఎంపి రాష్ట్ర ఇంచార్జి రవీంద్ర మాలిక్ తదితరులు పాల్గొన్నారు.