హైవే రోడ్డుపై గుంతల పూడ్చివేత

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :
మనం ఫౌండేషన్ ఉపాధ్యక్షులు శివ ఆధ్వర్యంలో క్యాతన్ పల్లి ఎక్స్ రోడ్డు నుండి గద్దరాగడి వరకు హైవే రోడ్డుపై ఉన్న గుంతలను సిమెంట్ కంకరతో మనం ఫౌండేషన్ సభ్యులు పూడ్చారు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ సభ్యులు ఆదివారం మాట్లాడుతూ రహదారిపై వెళ్లే బాటసారులు ఇచ్చిన సమాచారం మేరకు గుంతలను పూడుస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉన్న ఎవరికైనా ఆర్థిక సహాయం చేయడానికి ముందు ఉంటామని, కోతులకు అరటి పండ్లు అందిస్తున్నామని, రక్త దాన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్, శివకుమార్, చరణ్ , సుధాకర్, అనిల్ పాల్గొన్నారు.