ఎల్బీ నగర్ (జనం సాక్షి ) హస్తినాపురం డివిజన్ బీఎన్రెడ్డి నగర్ భారతి స్కూల్ గ్రౌండ్ వద్ద జెసిబి ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ మధుకర్ రెడ్డి , జనరల్ సెక్రెటరీ పదహారు జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ గణనాధుని నెలకొల్పారు.ఈ సందర్భంగా వినాయక మండపం దగ్గర శనివారం మధ్యాహ్నం బీఎన్రెడ్డినగర్ భారత్ పెట్రోల్ పంపు యజమాని కావేటి సుధా శ్రీనివాస్ సహకారంతో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు .ఈ సందర్బంగా వేలాదిమంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు . అధ్యక్షుడు ఏ మధుకర్ రెడ్డి , జనరల్ సెక్రెటరీ పదహారు జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి పురస్కరించుకుని వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని చెప్పారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.




