జులై16(జనంసాక్షి)
బీఎస్పీ నారాయణఖేడ్
నియోజకవర్గ కోశాధికారి శరణప్ప అకాల మరణం తీరని లోటని బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జి అలిగే జీవన్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నాగిల్ గిద్ద మండలం దామరిగిద్ద గ్రామానికి చెందిన శరణప్ప బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ కోశాధికారి గా పార్టీకి సేవలు అందించారని, వారి సేవలు ఎంతో గొప్పవని, సమ సమాజం కోసం బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగాపనిచేశారని వారు గుర్తు చేశారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి ధైర్యాన్ని, భరోసా ఇచ్చారు, కుటుంబం వెంట బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని, త్వరలో సంతాప సభ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాగిల్ గిద్ద నాయకులు శంకర్, మనూర్ మండల అధ్యక్షుడు అనుముల తుకారం ,లక్ష్మణ్ ,నర్సింలు తదితరులు పాల్గొన్నారు.




