Tuesday, 3 November 2026

బీఎస్పీ దీక్షకి మద్దతిచ్చిన కాంగ్రెస్, బిజెపి,నాయకులు

*మెట్పల్లి టౌన్, మార్చి 04,జనంసాక్షి :
టీయస్ పియస్సి పేపర్ లీకేజీకి నిరసనగా మెట్ పల్లి పట్టణం లోని ఆర్డిఓ కార్యాలయం దగ్గర బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలో కాంగ్రెస్, బిజెపి నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు, అడ్వకేట్ పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ సంఘటన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని అన్నారు నిరుద్యోగులకు బాసటగా నిలిచి, దోషులను వెంటనే శిక్షించాలని, అలాగే బిఎస్పి చేస్తున్న డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ఇలాంటి లీకేజీ సంఘటనలు మరల పునరావృతం కాకుండా పగడ్బందీగా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోరుట్ల నియోజకవర్గంలోని పట్టణ మండల వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు నాయకులు ప్రజలు, అధిక సంఖ్యలో వచ్చి దీక్ష కు మద్దతు తెలిపి విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి నాయకులు హఫీజ్, కుతుబుద్దీన్, నరేందర్ రెడ్డి , బీఎస్పీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి గుజ్జెరి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మణ్, సీనియర్ నాయకులు గోరుమంతల ప్రభాకర్, బర్ల లక్ష్మణ్, కిషోర్, ప్రశాంత్, నీరేటి నరేందర్, వెంకటేష్ గంగాధర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు