బీజేపీలో చేరికలు
సూర్యాపేట ( జనంసాక్షి): దేశ ప్రజలకు పారదర్శక , జవాబుదారీ పాలనను అందించడమే లక్ష్యంగా పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.బుధవారం సూర్యాపేట మండల పరిధిలోని లక్ష్మీ తండా గ్రామానికి చెందిన లునావత్ రవీందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపి ప్రభుత్వం పేదల కోసం ఎన్నో రకాల అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుందన్నారు.పార్టీలో చేరిన వారిలో వినోద్ కుమార్ , సాయికుమార్ , పవన్ , మహేష్ , హరిప్రసాద్, రమేష్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి శంకర్, ఉపాధ్యక్షులు మొండికత్తి శివాజీ , దళిత మోర్చా మండలాధ్యక్షులు మామిడి వెంకన్న , నాయకులు బోర రమేష్ , తంతెనపల్లి నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.