బీజేపీ పార్టీలో వివిధ పార్టీ నాయకులు చేరికలు

పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 16 (జనంసాక్షి) ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి లింగరాజుపల్లి గ్రామం నుండి భారతీయ జనతా పార్టీలోకి ఆలేరు మాజీ శాసన సభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది పార్టీలో చేరిన వారు తుమ్మల మల్లారెడ్డి ఎడ్ల సత్తి రెడ్డి ఎడ్ల అనిత మెట్టు కృష్ణ రెడ్డి ఎర్ర కిరణ్ రెడ్డి మరియు కొందరు కార్యకర్తలు చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తడిసిన మల్లారెడ్డి జిల్లా నాయకులు బొట్టు కృష్ణ జిల్లా కార్యవర్గ సభ్యులు గజరాజు కాశీనాథ్ మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ప్రశాంత్ బూత్ అధ్యక్షుడు అంబోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు