బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన బైక్ ర్యాలీ.

తాండూరు సెప్టెంబర్ 14(జనంసాక్షి)బీజేవైఎం రాష్ట్ర శాఖా పిలుపు మేరకు తాండూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ_విమోచన_బైక్ ర్యాలీ ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శ , బీజేవైఎం వికారాబాద్ జిల్లా ఇంచార్జి యూ రమేష్ కుమార్  ఆధ్వర్యంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భాంగా యూ రమేష్ కుమార్  మాట్లాడుతూ”ఎంఐఎం కి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత వజ్రోత్సావాలుగా కెసిఆర్ ప్రభుత్వం జరుపుతుందనీ. దమ్ముంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసారు.ఆనాడు  మొహమ్మద్ ఖాసీం రిజ్వి పాద ఘట్టం కింద నలిగిపోయిన అనేకమంది హిందూ మహిళల అమరత్వాన్ని ,వారి మీద నిజాం ఆక్రమణలను భౌతిక ,లైంగిక దాడులను మరిచిపోయిన కాంగ్రెస్ , తెరాస పార్టీలు ఎంఐఎం కి తొత్తులుగా పని చేస్తున్నాయని  ఆరోపించారు. రానున్న  రోజుల్లో తెలంగాణాలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని, తెలంగాణ ప్రజల ఆత్మా గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తాం అని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు అంతారం కిరణ్ , బీజేవైఎం జిల్లా కోశాధికారి గోవింద్ అసావా, జిల్లా బీజేవైఎం కార్యదర్శి రమేష్ సాగర్ ,భాను తేజ,  బీజేపీ నాయకులు భద్రేశ్వర్ , సందీప్, ప్రభుశంకర్ , నీరటి రవి, రామ్ చందర్, మిట్టి శ్రీనివాస్ ,మహేష్ , నీరటి రవి , సంగమేశ్వర్ , కొత్తూరు కర్ చంద్రశేఖర్, మారుతి చారీ, సంగేమ్ అనిల్, ఇతర బీజేవైఎం , బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.