Thursday, 5 November 2026

బీసీలపై కేసీఆర్‌ ది కపట ప్రేమ

– మండల ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ
హైదరాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : రిజర్వేషన్లపై కోర్టులో ఇంతగా వాదనలు జరుగుతుంటే.. అడ్వకేట్‌ జనరల్‌ హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే.. బీసీలపై కేసీఆర్‌ ది కపట ప్రేమే అని అర్థమౌతుందని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల్లో యాభైశాతం రిజర్వేషన్లు మించొద్దని కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్‌ కు సిగ్గు లేదని తెలిపారు. 2013లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్స్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఒప్పించిందని వెల్లడించారు.  యాబై శాతం నిబంధనను పక్కన పెట్టి.. 60 శాతానికి పైగా రిజర్వేషన్స్‌ అమలు చేసామని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులు లేకుండా సస్పెండ్‌ చేసి.. బిల్లు పాస్‌ చేశారని ఆరోపించారు. మేము సలహాలు ఇస్తామన్నా ఒప్పుకోకుండా.. ఇప్పుడు తప్పు మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ఇంత పెద్ద వివాదంపై కోర్టులో వాదనలు జరుగుతుంటే ఎందుకు అడ్వకేట్‌ జనరల్‌ హాజరు కాలేదని ప్రశ్నించారు. ఇదేనా బీసీలపై విూ ప్రేమ అని ప్రశ్నించారు. బీసీలపై కేసీఆర్‌ ది కపట ప్రేమ అంటూ ఆయన ప్రశ్నించారు. నేను చెప్పిందే చట్టం అనే వైఖరి కేసీఆర్‌ దని, అందుకే కోర్ట్‌
మొట్టికాయలు వేసిందిని, ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు.