బీసీ ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించాలి.
ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చి బీసీ ఈబీసీలకు ఇవ్వకపోవడం అన్యాయం.
బీసీ కులాల్లో పుట్టడమే పాపమా.
జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు. తాండూర్ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు సెప్టెంబర్ 14(జనంసాక్షి)రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ విద్యార్థుల పెంచిన ఇంజినీరింగ్ ఫీజులను ప్రభుత్వమే భరించాలని జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు. తాండూర్ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు పూర్తి ఫీజులను చెల్లిస్తూ బీసీ విద్యార్థులకు10 వేల ర్యాంకు దాటిన వారికి కేవలం రూ.35 వేలను మాత్రమే ఇవ్వడం అన్యాయమని తెలిపారు.హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలోని 81 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు పెంచారని మిగిలిన 34 కాలేజీల్లో కూడా ఫీజు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు .భారీగా పెంచిన ఇంజినీరింగ్ ఫీజులతో పేద బీసీ విద్యార్థులు చదువును మానేసే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు లక్షా యాభై నుండి 3 లక్షల వరకు తీసుకుంటున్నారు ప్రభుత్వం కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఫీజులు చెల్లించడంతో మిగతా లక్షా15 వేల పైన ఉన్న ఫీజులని విద్యార్థుల తల్లిదండ్రులు కట్టలేక బీసీ కులాలకు చెందిన టువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందిని అన్నారు .తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల్లో పుట్టడమే పాపమా అనే విధంగా ఉంది అన్నారు .అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంజనీరింగ్ కాలేజీలు పెంచిన ఫీజులని పూర్తిగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తిగా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని రాజ్ కుమార్ అన్నారు.
Attachments area