Wednesday, 4 November 2026

బీసీ కమిషన్‌ విచరాణకు రావాలి

ఆదిలాబాద్‌,మార్చి25 : జాతీయ బీసీ కవిూషన్‌ మెంబర్‌ సెక్రటరీ ఎకె.మంగోత్రి వచ్చే నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌కు రానున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి జె.రాజేశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌  ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 27 బీసీ కులాలకు సంబంధించిన సమస్యలపై వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. అలాగే కొత్తగా మార్పులు, చేర్పులు, ప్రస్తుతమున్న కులాల పేర్ల మార్పిడి వంటి అంశాలపై కవిూషన్‌ బహిరంగ విచారణ జరుపుతుందన్నారు.  జిల్లాలోని బీసీ కులాలు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమకు సంబంధించిన ఫిర్యాదులు లేదా వినతులు అందచేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *