బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా

ధర్మపురి శ్రీనివాస్
-బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా అధ్యక్షులుగా దూడల సిద్దయ్య గౌడ్ జనగామ (జనంసాక్షి) ఆగస్టు27:- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జనగామ పట్టణానికి చెందిన ధర్మపురి శ్రీనివాస్ నియమితులయ్యారు.ఈ మేరకు శ్రీనివాస్ కి ఆదివారం జనగామ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ నియామక పత్రాన్ని అందజేశారు.అనంతరం ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకు,జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా అధ్యక్షులుగా జనగామ జిల్లా చౌడారం గ్రామానికి చెందిన బీసీ నాయకులు దూడల సిద్దయ్య గౌడ్ ను నియమించడం జరిగింది.ఈ నియామకం మూడు సంవత్సరాల వరకు కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ తెలిపారు.తన ఎన్నికకు సహకరించిన జిల్లాలోని బీసీ నాయకులకు,రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.