ఖైరతాబాద్ : జూలై 20 (జనం సాక్షి) ఆర్‌టీఏ (రెడీ టు అసెంబల్) ఫార్మాట్‌లో అత్యున్నత శ్రేణి కిచెన్స్, వార్డ్‌రోబ్స్‌ను అందించే అత్యాధునిక మాడ్యులర్ ఫర్నిచర్ సొల్యూషన్స్ కంపెనీ, ఫాబియెన్స్ తమ సామర్ధ్యంను విస్తరిస్తూ హైదరాబాద్‌లోని మెడికల్ డివైజస్ పార్క్ వద్ద ఈ నూతన తయారీ కేంద్రం ఏర్పాటుచేసింది. ఈ నూతన తయారీ కేంద్రాన్ని 4 ఎకరాల విస్తీర్ణంలో 1.5 లక్షల చదరపు అడుగుల ప్రాంగణంలో అత్యాధునిక యూరోపియన్ యంత్రసామాగ్రితో ఏర్పాటుచేశారు. ఫాబియెన్స్ తమ ఉత్పత్తి శ్రేణిని విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. అంతేకాదు బీ2బీ విభాగంలో ప్రవేశించడం ద్వారా భారతదేశంలో కస్టమ్ మాడ్యులర్ కిచెన్స్, వార్డ్‌రోబ్స్ కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చనుంది. ఈ సందర్భంగా ఫాబియెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ టీ ఆర్ వేణు గోపాల్ మాట్లాడుతూ పారదర్శకత, అమలు, డెలివరీ అనేవి కీలక సిద్ధాంతాలుగా కలిగిఉండటంతో పాటుగా ఈ స్థాయి పారదర్శకతకు ధృవీకరిస్తూ ఫాబియెన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. బీ2సీ మాడ్యుల్ నుంచి తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా భారతదేశంతో పాటుగా విదేశాలలో సైతం బీ2బీ రంగంలో వినూత్నమైన మాడ్యులర్ కిచెన్స్, వార్డ్‌రోబ్ పరిష్కారాల కోసం కీలక ప్రదాతగా మారాలని కోరుకుంటున్నామని అన్నారు.
Attachments area




