ఖైరతాబాద్ : జులై 20 (జనం సాక్షి) అమెజాన్ ప్రైమ్ వీడియో బుధవారం రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ జీవిత చరిత్ర చిత్ర మొదటి ప్రదర్శనను ప్రకటించింది. ట్రైకలర్ ఫిల్మ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్ చే నిర్మించబడిన ఈ సినిమాలో ఆర్.మాధవన్ ప్రధాన పాత్ర పోషించారు. దర్శకుడిగా మొదటి అడుగు వేశారు. ఇందులో మ్రన్ రంజిత్ కపూర్ వంటి ప్రతిభగల నటీనటులు నటించారు. సూర్య ఒక ప్రత్యేక కేమియో పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే ఈ చిత్రాన్ని జులై 26 నాడు తమిళం, తెలుగు, మళయాళం, కన్నడ భాషా డబ్స్ ప్రసారం అవుతాయని నటుడు, దర్శకుడు ఆర్.మాధవన్ అన్నారు. ఈ చిత్రం ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంపై ఆధారపడి తీయబడిందని పేర్కొన్నారు.




