Monday, 2 November 2026

బుద్దుని బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి

– హుస్సేన్‌ సాగర్‌లోని బుద్ద విగ్రహాన్ని సందర్శించిన మండలి చైర్మన్‌
హైదరాబాద్‌, జ‌నం సాక్షి ) : బుద్ధపూర్ణిమను (బుద్ధుని పుట్టిన రోజు )పురస్కరించుకొని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ కే. స్వావిూగౌడ్‌, మండలి ఉద్యోగులతో కలిసి హుస్సేన్సాగర్‌ లోని బుద్ధవిగ్రహాన్ని సందర్శించారు. బుద్ధునికి పూవ్వులు సమర్పించి పూజలు నిర్వహించారు. సందర్బంగా ఆయన మాట్లాడుతూ బుద్ధుని బోదనలను ప్రతి ఒక్కరు ఆచరించాలని, ఆయన బోదనలు పాటించి సమాజం సత్యాన్ని,ధర్మాన్ని అనుసరించి సన్మార్గం వైపు నడువాలన్నారు. జ్ఞానాన్ని మించిన ధనం లేదని, ప్రతిఒక్కరు అహింసా మార్గాన్ని అనుసరించాలని బుద్ధుడు ప్రబోదించారన్నారు. ఆయన చూపిన మార్గం లో అందరూ నడవాలన్నారు.