బూత్ కమిటీలతోనే పార్టీ బలోపేతం

వీర్నపల్లి, ఆగస్టు 01 (జనంసాక్షి): మంగళవారం రోజున గర్జనపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీలను వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల శాఖా అధ్యక్షులు రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీల ఇంచార్జీలుగా సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, ఎండి రఫీ, మాచర్ల హరీష్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి రాజు, సర్పంచ్ గొర్రె కరుణ రంజిత్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు హేమా, ఉప సర్పంచ్ రామస్వామి, సీనియర్ నాయకులు గజ్జల ఆనందం, నలిమేటి చంద్రం పెంట మల్లేశ్, దొబ్బల సుదీర్, నర్సయ్య, రజినీ కాంత్, సంతోష్, లింగంపల్లి రాజు, యూత్ అధ్యక్షులు రాజు, రాజ ఎల్లయ్య , దావ పోషయ్య, సోషల్ మీడియా మండల కో-ఆర్డినేటర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు