హైదరాబాద్: బెయిల్ కుంభకోణాల కేసుల్లో గాలి జనార్దన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలు సిబ్బంది ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సురేష్‌బాబు, మాజీ న్యాయమూర్తులు పట్టాభి రామారావు, చలపతిరావు, ప్రభాకర్‌రావు, లక్ష్మీ నరసింహారావుతో పాటు ఇతర నిందితులు విచారణకు హాజరయ్యారు. కుంభకోణానికి సంబంధించి రెండు కేసుల విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది.




