Wednesday, 4 November 2026

బెల్లంపల్లిలో ఆటోను ఢీకొఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

ఆదిలాబాద్: ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బెల్లంపల్లి మండలం ఆకెనపల్లిలో వివాహ నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా… మంచిర్యాల నుంచి తాండూరు వైపు వెళుతున్న సిమెంట్ రేకుల లారీ ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పొన్నాల చిన్న లింగయ్య, దాసరి పోశం అక్కడికక్కడే మృతి చెందారు. పొన్నాల స్వామి, పొన్నాల పెద్దరాజంకు తీవ్ర గాయాలు కాగా  వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *