Wednesday, 4 November 2026

బెల్లంపల్లి నియోజకవర్గంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఫోటో రైటప్: జాతీయజెండా ఆవిష్కరిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయజెండా ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. మిఠాయిలు పంచి పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జక్కుల శ్వేతా, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యామల దేవి, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఎడ్ల మహేష్, స్ధానిక పోలీస్ స్టేషన్లలో సిఐలు ముస్కె రాజు, బాబురావు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కుమార స్వామి, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు.