Monday, 2 November 2026

బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మనోహర్.

బెల్లంపల్లి, మార్చ్ 31, (జనంసాక్షి )బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా న్యాయవాది చిప్ప మనోహర్ ఎన్నికయ్యారు. 2023-24 సంవత్సరానికి సంబందించి ఎన్నికలు శుక్రవారం ఎన్నికల అధికారి నల్లుల సంగీత ఆధ్వర్యంలో జరిగాయి. అధ్యక్ష పదవికి చిప్ప మనోహర్, అంకం శివ కుమార్ పోటీ పడగా మనోహర్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి పదవికి సింగతి రాజేష్, చేను రవి కుమార్ పోటీ పడగా సింగతి రాజేష్ గెలుపొందారు. స్పోర్ట్స్, కల్చరల్ పదవికి తౌటం సౌమ్య ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారి పదవికి సెరెపల్లి సునీల్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సంగీత వివరించారు.