Tuesday, 3 November 2026

బేగంబజార్ కు చేరుకున్న శోభయాత్ర..

7nl8czv7హైదరాబాద్ : శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలో నిర్వహిస్తున్న శోభయాత్ర బేగంబజార్ కు చేరుకుంది. ఈ సందర్భంగా బేగంబజార్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పలువురు నేతలు పాల్గొని ప్రసంగించారు. యాత్రలో ప్రదర్శించిన కళారూపాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విచిత్ర వేషధారణతో ఈ యాత్ర కొనసాగుతోంది. జై శ్రీరాం..జై శ్రీరాం అనే నినాదాలు మిన్నంటుతున్నాయి. యాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు.

ఉదయం ధూల్ పేటలో ప్రారంభమైన శోభయాత్ర గౌలిగూడ వ్యాయామశాలకు వరకు కొనసాగుతుంది. రాత్రి వరకు ఈ శోభయాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *