టేకులపల్లి, ఫిబ్రవరి 13 (జనం సాక్షి ): మండల పరిధిలోని బేతంపూడి గ్రామపంచాయతీలో రెండో విడత కంటి వెలుగు వైద్య పరీక్షలను జిల్లా పరిషత్ హై స్కూల్లో స్థానిక సర్పంచ్ ఎదలపల్లి బాబు చేతుల మీదుగా ప్రారంభం చేశారు. సోమవారం నుండి నుండి 23వ తారీకు వరకు నిర్వహించబడే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి మీనా కుమారి తో పాటు కంటి వెలుగు వైద్యాధికారి రూపా చంద్,ఆప్తాలమిక్ ఆఫీసర్ సనత్ కుమార్, డీఈవో దివ్య,సూపర్వైజర్ గుజ్జ విజయ, ఏఎన్ఎం లు ఎల్లమ్మ, లక్ష్మి,ఆశా కార్యకర్తలు శిరోమణి, బాలి, బుజ్జి, పద్మ తదితరులు పాల్గొన్నారు.




