బేల, ఆగస్టు 29 ( జనం సాక్షి ) : మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో సోమవారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా మండల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు బర్కడే రాము మాట్లాడుతూ బంద్ కు విద్యా సంస్థలు , ప్రజలు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాజా సింగ్ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల హిందూ వాహిని నాయకులు జీవన్, కుండ్లిక్ , దినేష్ , సంతోష్ , మహేష్ , ఆకాష్ ఆగర్కార్ తదితరులు పాల్గొన్నారు..
బేల బంద్ సంపూర్ణం..




