బొజ్జ గణపయ్యకు 118 రకాల నైవేద్యాలు

బొజ్జ గణపయ్యకు 118 రకాల నైవేద్యాలు

రాయికల్, సెప్టెంబర్ 26 (జనంసాక్షి)
బొజ్జ గణపయ్యకు 118 రకాల నైవేద్యాలతో సంఘమిత్ర(శివాజీ)యూత్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. రాయికల్ మండలంలోని స్థానిక శివాజీ విగ్రహం దగ్గర గల వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకు ఒక ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేస్తూ సమాజంలో భక్తిని పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ భక్తి, దురుద్దేశాలను,చెడు వ్యసనాలను దూరం చేయడమే గాక సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ సన్మార్గంలో నడిచే దారులు చూపిస్తామని దానికి సంఘమిత్ర (శివాజీ) యూత్ నిదర్శనం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యూత్ సభ్యులు,భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.