Tuesday, 3 November 2026

బోనమెత్తిన పుట్ట దంపతులు

జనంసాక్షి, మంథని : మిద్దె రాములు జయంతి ఉత్సవాల సందర్బంగా గురువారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజలు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. రాజగృహా నుంచి పుట్ట దంపతులు బోనం నెత్తిన పెట్టుకుని అంబేద్కర్‌ చౌక్‌ మీదుగా ఒగ్గు కథ కళాకారులు, మహిళలతో కలిసి ప్రదర్శనగా ఆలయానికి తరలి వెళ్లారు. రాజగృహ నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఒగ్గు కధ కళాకారులు నృత్యాలతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి బోనం సమర్పించి ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.