Tuesday, 3 November 2026

బోనాల పండుగలకు విస్తృత ఏర్పాట్లు

ఘనంగా నిర్వహించేలా చర్యలు

హైదరాబాద్‌,జూన్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే లష్కర్‌, లాల్‌దర్వాజా బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోల్కొండ బోనాలు ఘనంగా నిర్వహించిన తరవాత ఈ రెండు బోనాలపై దృష్టి పెట్టడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఈమేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నిశాఖలు సమన్వయంతో బోనాల పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు ఇప్పటికే సవిూక్షించారు. దేవాలయాలకు గత సంవత్సరం కంటే ఈసారి అధికంగా నిధులను కేటాయించినట్టు తెలిపారు. నిధులను పండుగకంటే ముందే విడుదల చేస్తామన్నారు. జాతరకు తరలి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడపనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. ఈసారి పండుగ ఏర్పాట్ల కోసం 15కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. నగరంలోని ప్రధాన దేవాలయాలకు పట్లు వస్త్రాలను దేవాదాయ శాఖ పంపుతుందని చెప్పారు. శాంతియుత వాతావరణంలో పండగ జరపుకోవాలని తలసాని శ్రీనివాస యాదవ్‌ ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేవాలయ కమిటీలు ఘనంగా ఏర్పాట్లు చేయాలని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. దేవాలయాల వద్ద సాంస్కృతిక బృందాలతో ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి చెప్పారు. టూరిజం శాఖ ఎంపిక చేసిన చోట్ల త్రీడీ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. సమాచార శాఖ ¬ర్డింగులను ఏర్పాటు చేస్తుందన్నారు. రోడ్ల మరమ్మతులకు, లైట్ల ఏర్పాట్లకు సరిపడా నిధులు కేటాయించారు. ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచే హైదరాబాద్‌ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ సారథ్యంలోనే నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పండుగకోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇంతకుముందు గోల్కొండ బోనాలకు భక్తులు మూడు వేల మంది మాత్రమే వచ్చేవారని, స్వరాష్ట్రంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో భక్తుల సంఖ్యలక్ష వరకు పెరగనుందని భావిస్తున్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ సింహవాహిని అమ్మవారి బోనాలతో ముగుస్తాయన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం గత మూడేళ్లుగా నగరంలో ఎక్కడా డీజేలకు అనుమతి లేదని, ఈసారి కూడా లష్కర్‌ బోనాల్లో అదే అనవాయితీ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. బోనాల జాతర సవిూపిస్తున్న క్రమంలో ఆయా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. బోనాలతో వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తారు. బోనాలకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున గతేడాది కంటే ఈ సారి అదనంగా పోలీసులను పెంచాలని కమిషనర్‌ను కోరినట్టు తెలిపారు. వేడుకల సందర్భంగా ఎక్కడైనా అశ్లీల నృత్యాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

——-