Wednesday, 4 November 2026

బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం.

బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం.
మల్కాజిగిరి.జనంసాక్షి.జూలై18
ఆదివారం జరిగే బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం పాత మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, మరియు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సలహాలు సూచనలు చేశారు.ఆలయ పరిసర ప్రాంతాలలో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని,మంచినీరు,పోలీస్ పెట్రోలింగ్,క్యూలైన్ల ఏర్పాటు,తాత్కాలిక రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలను చర్చించి వారికి బాధ్యతలను అప్పగించారు.ఈసమావేశంలో డిప్యూటీ కమిషనర్ రాజు,ఎస్సై శ్రీనివాస్,ఏఈ సత్య లక్ష్మి,జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్రవంతి,మనోహర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మండల రాధా కృష్ణ యాదవ్,రామకృష్ణ, సత్యనారాయణ గౌడ్,యాదయ్య, శంకర్,శ్రీనివాస్ గౌడ్,విజయ్ కుమార్, నారాయణ,రమేష్,సురేష్,సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area