Wednesday, 4 November 2026

మండల కేంద్రంగా భూపతిపూర్ గ్రామాన్ని ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వినతిపత్రం

మండల కేంద్రంగా భూపతిపూర్ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వినతిపత్రం సమర్పించిన భూపతిపూర్ గ్రామస్తులు..\
.. జనం సాక్షి:-…. (ఆగస్టు 5).. రాయికల్ మండల్ భూపతి పూర్ గ్రామాన్ని మండల కేంద్రం గా ఏర్పాటు చేయాలని కోరుతూ జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారిని ఎమ్మేల్యే క్వార్టర్స్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేసిన భూపతి పూర్ గ్రామ ప్రజలు,నాయకులు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్,ఉప సర్పంచ్ వేణు,సింగిల్విండో ఛైర్మెన్ ముత్యం రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షుడు ఏల్లాల దేవేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ ,రమేష్,అశోక్,శేఖర్,మహేందర్ గౌడ్,రాజారెడ్డి,రంజిత్,భూపతి,దిలీప్,చిన్నయ్య,గంగారెడ్డి,శ్రీనివాస్,రాజేంద్రప్రసాద్,రాజేందర్,తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.