Tuesday, 3 November 2026

బోయినపల్లిమండల ప్రజలకు విజ్ఞప్తి: ఎస్సై అభిలాష్

రాత్రి నుండి అదికంగా కురుస్తున్న వర్షం కారణంగా అదేవిదంగా రెండు, మూడు రోజులు తుఫాను & అధిక వర్షపాతం ఉన్నందున,వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున, కల్వర్ట్ లు వాగులు వంకలు దాటేప్పుడు ప్రజలు తగు జాగ్రతలు పాటించాలి. వ్యవసాయ దారులు వ్యవసాయ పనులకు వెళితే ఒకవేళ కరంట్ పోల్స్ ముట్టుకుంటే కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలి. అలెగే గ్రామాల్లో పెద్దలు తమ పిల్లల్ని ఇప్పుడు బయటి వదలకుండా జాగ్రత్త వహించండి. వాగుల వద్దకు ,చెరువుల వద్దకు వెళ్లకుండా చూడాలి,వర్షం కారణంగా నీటి గుంతలు, మాన్ హోల్స్ ఉంటాయి కావున పిల్లలకు ప్రమాదం కాబట్టి పిల్లల్ని బయటికి పంపవద్దు.అలాగే చేపల వేటకు వగుల వద్దకు, కానీ చెరువులోకి కానీ,మధ్య మానేరు జలాశయం లోకి వెళ్లకూడదు, వాగులు దాటేందుకు ప్రయత్నం చేయవద్దు పాత ఇండ్లు కూలి పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. బోయినపల్లి పోలీస్