బోరింగ్ మెకానిక్ సుధాకర్ ఇక లేరు

టేకులపల్లి, అక్టోబర్ 18( జనం సాక్షి): మండల ప్రజలందరికీ సుపరిచితుడు అందరితో స్నేహభావాలతో కుటుంబ సభ్యులు లాగా వరసలు పెడుతూ అందరినీ నవ్విస్తూ పలకరిస్తూ ఎక్కడ బోరింగ్ రిపేర్ ఉంటే ఒక్క ఫోన్ కాల్తో అక్కడ ప్రత్యక్షమై మరమ్మత్తులు చేపడుతూ ఇంటి పేరుని బోరింగ్ మెకానిక్ సుధాకర్ గా పిలిపించుకునే గుంటి సుధాకర్(42) ఇక లేరు అంటేనే బాధ కలిగించే వ్యక్తి నిజంగానే ఇక లేరు. మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన సుధాకర్ పేద కుటుంబంలో జన్మించి విద్యాభ్యాసము నుండే ఎన్నో కష్టాలు పడుతూ ఇంటికి పెద్దవాడు కావడంతో తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తన సోదర సోదరీమణులకు పెద్ద దిక్కుగా మారి మండల పరిషత్ కార్యాలయంలో టెంపరరీగా బోరింగ్ మెకానిక్ గా గత 20 సంవత్సరముల నుండి పనిచేస్తూ అధికారులు, ప్రముఖులు, మండల ప్రజలతో సత్సబందాలతో మెలిగేవాడు. ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 8 నెలల క్రితం హైదరాబాదు పట్టణంలో ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్నాడు. ఆయన స్వగృహంలో మంగళవారం తుది శ్వాస విడిచాడు. ఆయనకు భార్య ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు.