సికింద్రాబాద్ న్యూ బోయినపల్లి అక్టోబర్ 17 జనం సాక్షి బోయినపల్లి కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఒకటో వార్డు, ఆరో వార్డు లో తాను ఇచ్చిన వర్కర్లు ఆర్డర్ పనులు ఇప్పటికీ అమలు కాకపోవడంతో బోర్డు నామినేటెడ్ సివిల్ సివిలియన్ సభ్యుడు రామకృష్ణ పై మండిపడ్డారు, బిజెపి సభ్యులు చేసేదేమీ లేక మేము గతంలో మేము శంకుస్థాపన చేసిన పనులకు ఇప్పుడు మళ్లీ అదే అవే పనులకు కొబ్బరికాయలు కొడుతున్నారు అన్ని అన్నారు,గత 18 నెలలుగా ఒక్క పని కూడ అమలు కావడం లేదు అన్నారు, రామకృష్ణ వచ్చినప్పటి నుంచి బోర్డ్ లో ఏడు మీటింగులు జరిగిన 500 పైగా ఇష్టమేటి ఇచ్చిన పనులు పెండింగ్ లో ఉన్నాయి, కృష్ణారెడ్డి కాలనీ , సౌజన్య కాలనీ న్యూ సిటీ కాలనీ సిసి రోడ్లు డాంబర్ రోడ్లకు పైప్ లైన్ పనులకు అనుమతులు వచ్చినప్పటికే పనులు ఇప్పటికీ ముందుకు జరగడం లేదు అన్నారు,కంటోన్మెంట్ బోర్డ్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తర్వాత గతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు,
బిజెపి గవర్నమెంట్ కి దమ్ము ధైర్యం ఉంటే వెంటనే కంటోన్మెంట్ బోర్డ్ ఎలక్షన్ జరిపించాలని డిమాండ్ చేశారు,
ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యురాలు నలిని కిరణ్, మాజీ సభ్యుడు ప్రభాకర్, మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.




