Wednesday, 4 November 2026

బోర్లం గ్రామ బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడిగా అమీన్

 హుస్సేన్బోర్లం గ్రామ బీఆర్ఎస్ మైనారిటీ అధ్యక్షుడిగా అమీన్ హుస్సేన్బిచ్కుంద బాన్సువాడ మార్చి 27 (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు కీ.శే సయ్యద్ అహ్మద్ హుస్సేన్ స్వర్గస్తులైనందున గ్రామ మైనారిటీ పార్టీ అధ్యక్షుని స్థానం ఖాళీ ఏర్పడడంతో బోర్లం గ్రామ పార్టీ అధ్యక్షుడు గోపనపల్లి సాయిలు, ఎంపిటిసి పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్, పార్టీ ప్రజాప్రతినిధులు మరియు మైనారిటీ సోదరులందరూ కలిసి సయ్యద్ అమీన్ హుస్సేన్ ని సోమవారం నాడు గ్రామ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అమీన్ హుస్సేన్ గారు మాట్లాడుతూ పెద్ద మనసుతో తనకు మైనారిటీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మైనారిటీ సోదరులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తన తండ్రి అహ్మద్ హుస్సేన్ చూపిన న్యాయము బాటలో నడుచుకుంటానని గ్రామ పార్టీ పెద్దలు, మైనారిటీ సోదరులందరి వెన్నంటి ఉంటానని, పార్టీకి మరియు బాన్స్వాడ అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి, సురేందర్ రెడ్డికి విధేయుడిగా ఉండి పనిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద శ్రీనివాస్, రైతుబంధు మండల డైరెక్టర్ పెద్దపట్లోళ్ల దేవేందర్ రెడ్డి, మైనారిటీ మండల అధ్యక్షుడు జలీల్, వార్డు మెంబర్ నాగభూషణ్, షేక్ మహబూబ్ ,దడ్గి అహ్మద్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.