Wednesday, 4 November 2026

బౌద్ధబిక్షుల కోసం నూతనంగా విద్యాలయ భవనాన్ని ప్రారంభించిన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ (జనం సాక్షి ) .ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు. బౌద్ధ మతాన్ని అవలంభించడం బారతీయులందరికి గర్వకారణమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాకామాత్యులు కిషన్ రెడ్డి తెలిపారు.  సికింద్రాబాద్ లోని మహేంద్రహిల్స్ బుద్ధవిహార్ వద్ద బౌద్ధబిక్షుల కోసం నూతనంగా నిర్మితమైన విద్యాలయ భవనాన్ని  కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బౌద్ధమతాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాలను ఆబివృద్దిపరచడం కోసం  ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నారని పేర్కొన్నారు.. బుద్ధుని సూక్తుల ప్రచారానికి  ప్రాధాన్యత నిస్తున్నామని అన్నారు..భారతదేశం కేంద్రంగా  ప్రపంచంలోని బౌద్ధులందరిని ఏకం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు.. అనేక దేశాలకు బౌద్ధమతం విస్తరించినప్పటికి మూలం మన దేశం కావడం, బుద్ధుడు ఈ బూమిపైనే పుట్టడం మన అందరికి గర్వకారణం అని స్పష్టం చేశారు..