Thursday, 5 November 2026

బ్యాంకుకు వాటర్ కూలర్ వితరణ.

ఫొటో : వాటర్ కూలర్ అందజేసిన మేనేజర్.
నెన్నెల, మార్చ్ 23, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు గురువారం మేనేజర్ రాజారాం వాటర్ కూలర్ అందజేశారు. ఈసందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ వేసవి కాలం సీజన్లో ఖాతాదారులు తాగునీటికి పడుతున్న ఇబ్బందులను గమనించి వాటర్ కూలర్ అందించాలని అనుకున్నానని నూతన తెలుగు సంవత్సరాది సందర్బంగా ఈ వాటర్ కూలర్ అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, క్యాషియర్ కొమురయ్య, కేశవ్, సిబ్బంది ఎస్కూరి రాజం, సేని వెంకన్న, ఖాతాదారులు పాల్గొన్నారు.