బ్యాంకు సేవలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

డిసిసిబి బ్యాంక్ మేనేజర్ నారాయణ రెడ్డి
మోమిన్ పేట అక్టోబర్ 1 జనం సాక్షి
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ప్రజలు బ్యాంకుల సేవ లు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని డిసిసిబి బ్యాంకు మేనేజర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు శనివారం మండల పరిధిలోని కోలుకుందా గ్రామంలో బ్యాంకు వినియోగదారుల అవగాహన సదస్సు కళాజాత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజ లు బ్యాంకు సేవలకు దూరంగా ఉన్నారని ప్రజలందరూ డిసిసిబి పిఎసిఎస్ సేవలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహకార సంఘాల ద్వారా ప్రయోజనం పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈఓ బాలకృష్ణ సిబ్బంది జహంగీర్ పి ఏ సిఎస్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు