బెల్లంపల్లి, ఏప్రిల్ 29, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలో ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం బెల్లంపల్లి శాఖ వారి ఆధ్వర్యంలో 22 మంది నృత్య గురువులకు, 44 మంది ప్రముఖ కళాకారులకు సన్మానం చేశారు. ఈసందర్భంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న బెల్లంపల్లి ఆర్డివో శ్యామల దేవి మాట్లాడుతూ కళాకారులను సత్కరించుకోవడం శుభప్రదం అని, ఇంతమంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన బెల్లంపల్లి శాఖ బ్రహ్మ కుమారిస్ సంస్థను అభినందించారు. అనంతరం కళాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా బ్రహ్మ కుమారిస్ కరీంనగర్ సంచాలకులు బికే మనీషా, గౌరవ అతిధిగా టెక్నో డాన్స్ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమాండ్ల మధుకర్, మంచిర్యాల జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్ , కార్యదర్శి రామగిరి అర్జున్, నిర్వాహకులు బికే పద్మ, బికే కైవల్య, బ్రహ్మ కుమారి పరివారం, ప్రముఖ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.




