Wednesday, 4 November 2026

బ్రాహ్మణ బస్తీ మరియు మహ్మద్ గూడ ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్ సామల హేమ

  సికింద్రాబాద్ (జనం సాక్షి ) :
డిప్యూటీ స్పీకర్  పద్మారావు   గౌడ్   ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కార్పొరేటర్ సామల హేమ పాదయాత్ర చేస్తూ ఇంటింటికీ వెళ్ళారు . స్థానికులను పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు  .  డ్రైనేజీ లైన్ ఉప్పొంగుతుంది అని లైన్ చిన్నదిగా ఉండటం వల్ల చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ ఓవర్ ఫ్లో అయ్యి   మురుగు  నీరు రోడ్లపై నిలుస్తుందని  స్థానికులు  తెలిపారు . స్పందించిన కార్పొరేటర్ నూతన  డ్రైనేజీ లైన్ కు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యింది అని వర్షాలు తగ్గుముఖం పట్టగనే పనులు మొదలు పెడతాం అని హామీ ఇచ్చారు.ఏదైనా సమస్య ఉన్న మా దృష్టికి తీసుకురావాలని కోరారు .  ఈ కార్యక్రమంలో అధికారులు డి జి ఎం కృష్ణ ,మేనేజర్ నవ్య,కావ్య, తెరాస నాయకులు కరాటే రాజు,కుమార్ సికింద్రాబాద్ కో ఆర్డినేటర్ జలెందర్ రెడ్డి,రాజ సుందర్,స్థానికులు తదితరులు పాల్గొన్నారు
Attachments area