హైదరాబాద్ : బ్లాక్ డే సందర్భంగా గురువారం నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీమసీదు విధ్వసంక దినమైన డిసెంబర్ 6న కొన్ని సంస్థలు బ్లాక్‌డే జరుపుకుంటాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నేటి నుంచి శనివారం వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీ సహా సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ నేడు పాతబస్తీలో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు.




