జనంసాక్షి, మంథని : కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా సైదాపూర్ గ్రామంలో నూతన బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమములో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ,కెపిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ లతో కలిసి ఏఐసీసీ సెక్రెటరీ, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శనివారం పాల్గొన్నారు. అనంతరం యాదగిరి జిల్లాలోని సైదాపూర్ లో జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొని ప్రసంగించారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీధర్ బాబు దిశా నిర్దేశం చేశారు
బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ శంకుస్థాపనలో పాల్గొన్న ఏఐసీసీ సెక్రెటరీ దుద్దిల్ల శ్రీధర్ బాబు




