Tuesday, 3 November 2026

భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 30
అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ ఆధ్వర్యంలో దుర్గ అమ్మవారి గుడిలో నవరాత్రుల సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజ కార్యక్రమాని కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ మాంగల్యబలం గట్టిగా ఉండాలని కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి వద్ద కుంకుమార్చన పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేదపండితుల
మత్రోచరణల నడుమ సాగిన సామూహిక కుంకుమార్చనతో ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లి విరిసింది. కాలనీవాసులు అమ్మవారికి వివిధ రకాలుగా నైవేద్యాన్ని తీసుకువచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ అధ్యక్షులు బి నాగేశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, శివరాజ్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Attachments area