Tuesday, 3 November 2026

భద్రాచలంలో కార్తీక మాస పూజలు

జ‌నంసాక్షి: కార్తీక మాసం తొలిరోజు సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రాచలం వద్ద పవిత్ర గోదావరి నదిలో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంచారు. .భక్తులు గౌరీ దేవిని పూజించి తులసీ మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అమ్మవారి నామస్మరణ చేసి కార్తీక దీపాలను గోదావరిలో వదిలారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకమాసం తొలిరోజు సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. కార్తీక దీపాలను భక్తులు గోదావరిలో వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.