Wednesday, 4 November 2026

భయాందోళన లేకుండా పరీక్షలు రాయండి

భయాందోళన లేకుండా పరీక్షలు రాయండి
నేరేడుచర్ల ( జనంసాక్షి)న్యూస్ :  విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు రాయాలని బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వెంకటప్పయ్య సూచించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో  మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయని,అన్ని సబ్జెక్టులో ముఖ్యమైన విషయాలను అధ్యయనం చేయాలని, మోడల్ పేపర్ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సబ్జెక్టులలో తెలియని విషయాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.