* భరోసా యాత్ర బిజెపి పాలిత రాష్ట్రాలలో పెట్టాలి..

ఫోటో : సమావేశంలో మాట్లాడుతున్న టిఆర్ఎస్వి నాయకులు..
సిద్దిపేట అర్బన్, జూలై 21(జనం సాక్షి):
 భరోసా యాత్ర పెట్టాల్సింది బీజేపీ పాలిత ప్రాంతాలలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కాదు అని టిఆర్ఎస్వి అర్బన్ మండల అధ్యక్షులు నరేష్, కోఆర్డినేటర్ విజయ్ అన్నారు. గురువారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సామాన్యలకు అందకుండా అన్ని రెట్లు  పెంచి వారి నెత్తి మీద గ్యాస్ బండ ను వేసింది బిజెపి ప్రభుత్వం కాదాఅన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ప్రజలు కష్టాలు లేకుండా ఉన్నారని అన్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సింది బిజెపి పాలిత ప్రాంతాలలో మాత్రమే అని అన్నారు. బిజెపి నాయకులు సిద్దిపేట మండల గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూసి  మోడీ కి చెప్పి బిజెపి పాలిత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలానే చేయించుమను సూచించాలని అన్నారు. తెలంగాణ చూసి బిజెపి నాయకులు చాలా నేర్చుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్యామ్, ఉపాధ్యక్షులు వాటు ప్రశాంత్, నాయకులు దయాకర్, రఘు, రంజిత్, స్వామి, నాగరాజు, ఆంజనేయులు, అహ్మద్, అజిజ్,  భరత్ తదితరులు పాల్గున్నారు.
Attachments area