Wednesday, 4 November 2026

భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం కార్యక్రమం

– చైర్ పర్సన్ గెల్లి అర్చనారవి
హుజూర్ నగర్ జులై 28 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం కార్యక్రమం చేపట్టిందని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి అన్నారు. గురువారం హుజూర్ నగర్ మున్సిపాలిటీలో  చైర్ పర్సన్ అర్చనారవి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ అర్చనరవి మాట్లాడుతూ రాష్ట్ర విస్తీర్ణంలో 33% పచ్చదనం ఉండాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి తెలంగాణ
ప్రభుత్వం హరితహారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని  అన్నారు. తెలంగాణలో సమృద్ధిగా వానలు కురిసేందుకు, అడవులను రక్షించి, చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడటమే లక్ష్యంగా తెలంగాణలో హరితహారం కార్యక్రమం చేపట్టారని అందులో భాగంగానే ఇంటింటికి మొక్కలు పంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.