హైదరాబాద్ : శాసనసభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గస్‌పార్కు వద్ద భాజపా ఎమ్మెల్యేలు సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేశారు. శాసనసభ నుంచి ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు, నాగం జనార్ధన్‌రెడ్డి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.




